నేడు విడుదల కాబోతున్న ‘ఆచార్య’ ఫలితం గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కేజీ ఎఫ్ 2’ ఘన విజయాల తరువాత చాల తక్కువ గ్యాప్ తో విడుదల కాబోతున్న భారీ సినిమా కావడంతో ఈసినిమా క్రియేట్ చేయబోయే రికార్డుల గురించి మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ఈసినిమాకు ఓవర్ బడ్జెట్ అవ్వడంతో ఈసినిమా పై వడ్డీల భారం బాగా పడిన విషయం ఓపెన్ సీక్రెట్. దీనితో ఈమూవీ నిర్మాత సేఫ్ గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి చరణ్ కొరటాల లు ఒక్క రూపాయి కూడ పారితోషికం తీసుకోలేదు. దీనితో ఈసినిమాకు టోటల్ గా పాజిటివ్ టాక్ వస్తే కాని ఈమూవీ నిర్మాతలకు భారీ లాభాలు వచ్చి ఆతరువాత చిరంజీవి చరణ్ కొరటాల లు భారీ పారితోషికాలు తీసుకునే ఆస్కారం ఉంది.
అలా కాకుండా ఈమూవీకి డివైడ్ టాక్ వస్తే ఈమూవీ నిర్మాతలకు అదేవిధంగా ఈమూవీ బయ్యర్లకు కోరుకున్న లాభాలు రావడం కష్టం అన్నప్రచారం జరుగుతోంది. సాధారణంగా చిరంజీవి తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు దొరకడం పెద్ద సమస్య కాదు. అయితే ‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ ఇప్పటికీ చాల ప్రాంతాలలో బాగా ఉన్న నేపధ్యంలో ‘కేజీ ఎఫ్ 2’ ధియేటర్లలో కొనసాగిస్తున్నారు.
దీనితో కొంతవరకు ధియేటర్ల సమస్యలు కూడ వచ్చాయి అన్నవార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘ఆచార్య’ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి వాస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ కు టిక్కెట్ల రేట్లు పెంచినంతగా ‘ఆచార్య’ కు పెంచలేదు. వాస్తవానికి ఈమూవీ చిరంజీవి చరణ్ కొరటాల క్రేజీ కాంబినేషన్. అయితే ఈమూవీ తరువాత కొంత గ్యాప్ లో విడుదల అయ్యే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీకి పెద్దగా క్రేజ్ లేని మోహన్ రాజా ఆతరువాత వచ్చే చిరంజీవి సినిమాలకు ప్రస్తుతం ఫ్లాప్స్ తో కొనసాగుతున్న బాబి మెహర్ రమేష్ లు దర్శకత్వం వహిస్తున్న పరిస్థితులలో ఆ సినిమాల మార్కెట్ అంతా ‘ఆచార్య’ కలక్షన్స్ పైనే ఆధారపడి ఉంటుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి