ఇక తెలుగులో ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. టాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాలను ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా చాలా అమితంగా ఇష్టపడుతున్నారు.ఇక ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలకు ఈమధ్య కాలంలో మంచి గుర్తింపు ఇంకా అలాగే వసూళ్లు అనేవి దక్కతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌ అనగానే ఎవ్వరికైనా ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుర్తుకు వస్తాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలు ఎక్కువగా అమెరికాలో ఆడుతున్నాయి. అమెరికాలో మొదటి 1 మిలియన్ మార్క్‌ దక్కించుకున్నది కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే. ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి సినిమాలన్నీ కూడా అక్కడ మంచి వసూళ్లని నమోదు చేస్తున్నాయి. అయినా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతే అక్కడ రాజమౌళి అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబు ఏకంగా 11 సినిమాలతో అమెరికాలో మిలియన్ మార్క్ రికార్డులను సెట్ చేశాడు. ఇక సర్కారు వారి పాట సినిమా కూడా ప్రీమియర్‌ లతో కలిపి మొదటి రోజే వన్ మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది.ఇక ఎలాగో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి లాంగ్ రన్ లో ఖచ్చితంగా ఈ సినిమా మూడు మిలియన్ డాలర్లను ఈజీగా వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు.ఓవర్సీస్ లో సర్కారు వారి పాట సినిమా 1 మిలియన్ డాలర్లను క్రాస్ చేయడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మిలియన్ డాలర్ల సినిమాల సంఖ్య మొత్తం 11 కి చేరింది. సౌత్ ఇండియాలోనే మహేష్ బాబు నెం.1 గా ఈ రికార్డుతో దూసుకుపోతున్నాడు. ఇక టాలీవుడ్ తరపున ఆయన తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏడు సినిమాల తో మిలియన్ మార్క్ ను టచ్ చేశాడు. ఇక ఆరు సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నెం.3 లో ఉన్నాడు.న్యాచురల్ స్టార్ నాని కూడా ఆరు సినిమాలతో మిలియన్ మార్క్ ను చేరుకోగా అల్లు అర్జున్‌ 5 ఇంకా ప్రభాస్ 4 సినిమాలతో అక్కడ మిలియన్ డాలర్ల వసూళ్లు చేశారు. ఈ జాబితాలో రామ్ చరణ్ ఇంకా ఇతర స్టార్ హీరోలు చాలా కింద వరుసలో ఉన్నారు.ఇక ఈ మధ్య విడుదల అయిన సినిమాలు దాదాపు అన్ని కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లను వసూళ్లు చేస్తున్నాయి. కాబట్టి ముందు ముందు నెంబర్స్ మారే అవకాశాలు ఉన్నాయి.ఎంత మారిన కానీ సూపర్ స్టార్ మహేష్ దారిదాపుల్లోకి ఏ హీరో కూడా రాలేడని పూర్తిగా స్పష్టంగా రికార్డ్స్ చూస్తే అర్ధమయ్యిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: