బాలకృష్ణకు 63 సంవత్సరాలు అంత వయసు ఉన్నప్పటికీ షూటింగ్ స్పాట్ లోకి వచ్చేసరికి బాలయ్య 30 సంవత్సరాల యువకుడుగా మారిపోతాడు. అతడు వేసే జోక్స్ అతడి ఎనర్జీని చూసి ఎవరైనా షూటింగ్ స్పాట్ లో ఆశ్చర్యపడటం ఖాయం. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఒక పవర్ ఫుల్ మూవీలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు.


మూవీ షూటింగ్ ప్రస్తుతం చాల శరవేగంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకల్లా షూటింగ్ స్పాట్ కు వస్తున్న బాలకృష్ణ ఎండలను కూడ లెక్కచేయకుండా సాయంత్రం 6 గంటల వరకు అదే ఉత్సాహంతో పనిచేయడం చూసి తాను షాక్ అయ్యాను అంటూ ఈమధ్య శ్రుతిహాసన్ చెప్పింది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో జరుగుతోంది.


అయితే ఈ ఐటమ్ సాంగ్ కు ఎవరు ఊహించని విధంగా భారతీయ మూలాలు ఉన్న ఒక ఆస్ట్రేలియన్ మోడల్ ను తీసుకువచ్చారు ఆమె పేరు చంద్రిక రవి ఈ స్పెషల్ సాంగ్ లో ఆమె బాలకృష్ణతో స్టెప్స్ వేస్తోంది. తమన్ కంపోజ్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ యూత్ బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ లో బాలయ్య వేసే స్టెప్స్ నందమూరి అభిమానులకు విపరీతంగా నచ్చే విధంగా డిజైన్ చేసారని అంటున్నారు.


‘అఖండ’ సూపర్ సక్సస్ తరువాత విడుదల కాబోతున్న మూవీ కాబట్టి ఈమూవీ ఐటమ్ సాంగ్ గురించి అందరు మాట్లాడుకోవడానికి ఇలా వెరైటీగా ఆస్ట్రేలియన్ మోడల్ ను రంగంలోకి దింపారు. మంచి డాన్సర్ కూడ అయిన ఈ బ్యూటీ వేసే స్టెప్స్ కు బాలకృష్ణ చాల శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి వేసిన స్టెప్స్ ను చూసి ఆ బ్యూటీ బాలయ్య వయసు 63 సంవత్సరాలు అంటే నమ్మలేకోతున్నాను అని అందట..
మరింత సమాచారం తెలుసుకోండి: