తెలుగులోని టాలెంటెడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరనే విషయం తెలిసిందే. తెలుగులోని దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి పూరీ జగన్నాథ్ వర్క్ చేశారు.


పూరీ జగన్నాథ్ ఎక్కువగా యూత్ ను ఆకట్టుకునే అంశాలతో సినిమాలను తెరకెక్కిస్తారనే విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపులతో డీలా పడిన ప్రతిసారి కూడా మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం లైగర్ సినిమాతో పూరీ జగన్నాథ్ చాలా బిజీగా ఉన్నారు.


లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కనుక సాధిస్తే పూరీ జగన్నాథ్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరో అనే విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయట. జనగణమన పేరుతో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించనుండటం విశేషం 


అయితే చాలా సంవత్సరాల క్రితం పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ తో 143 అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


కథ, కథనం బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైందట.. సాయిరాం శంకర్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ లేకపోవడం, కథ కథనంలో చిన్నచిన్న లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఒక విధంగా కారణమయ్యాయని తెలుస్తుంది.. అయితే మరి కొందరు మాత్రం టైటిల్ విషయంలో మేకర్స్ పొరపాటు చేశారని ఈ సినిమాకు మరో మంచి టైటిల్ ఫిక్స్ చేసి ఉంటే ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధించేదని వెల్లడించారట.పూరీ జగన్నాథ్ సినిమాలలో చాలా సినిమా లు టైటిల్స్ వల్లే హిట్టయ్యాయని  అయితే ఈ సినిమా విషయంలో మాత్రం పూరీ జగన్నాథ్ పొరపాటు చేశార నే చెప్పవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: