పోయిన వారం విడుదల అయిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను సాధించాయి.తప్పకుండా ఈ సినిమా లు అలరిస్తాయని అందరు ముందునుంచి భావించగా అనుకున్న విధంగా ఈ సినిమాలకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందిస్తున్నారు. అడివి శేష్ హీరో గా నటించిన మేజర్ సినిమా ఒకటి కాగా మరొకటి కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విక్రమ్ సినిమా. ఈ రెండు సినిమాలు కూడా వేటికవే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అందుకే ఈ సినిమాలు ప్రేక్షకులను ఈ స్థాయి లో అలరిస్తున్నాయి.

వాస్తవానికి మేజర్ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉండగా పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. దాంతో ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది. సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. మహేష్ బాబు కూడా ఈ సినిమా కి వెన్నుముక గా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అయన చురుగ్గా పాల్గొన్నాడు. అందుకే ఈ సినిమా కు ఇంతటి సక్సెస్ వచ్చింది. అయితే తొలి రెండు రోజులు ఈ సినిమా కి మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సినిమా యొక్క కలెక్షన్స్ మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయని చెప్పొచ్చు.

దానికి విక్రమ్ సినిమా కి మంచి టాక్ రావడమే. ఈ సినిమా కు మొదట్లో టాక్ రాలేదు. కమల్ హాసన్ కి పెద్ద గా మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమా ను ఎవరి తెలుగులో పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా మౌత్ టాక్ ప్రకారం అందరు బాగుంది అనడం తో ఒక్కొక్కరు ఈ సినిమా ను చూడడం మొదలుపెట్టారు. అలా ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా మేజర్ కలెక్షన్స్ పై ప్రభావం చూపేంతగా ఈ చిత్రం హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా కి రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. నితిన్ ఈ సినిమా ను తెలుగు లో డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: