నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , ఆ తర్వాత హీరోగా అవకాశాలను అంది పుచ్చుకున్నాడు.  హీరో గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే నాచురల్ స్టార్ నాని కి మంచి విజయాలు బాక్సాఫీస్ దగ్గర లభించాయి .

బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు లభించడంతో నాచురల్ స్టార్ నాని తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే నాని వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన సమయంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బలే బలే మగాడివోయ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. బలే బలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు ఉన్న పాత్రలో నటించి నాని ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే  బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన మారుతి దర్శకత్వంలో నాని మరొక సినిమాలో నటించబోతున్నట్లు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రస్తుతం దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1 వ తేదీన విడుదల కాబోతుంది. ఆ తర్వాత మారుతి, ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాడు. మరి నాని తో కనుక  మూవీ సెట్ అయినట్లు అయితే ప్రభాస్ సినిమా కంటే ముందు చేస్తాడా...  లేక ప్రభాస్ సినిమా తర్వాత చేస్తాడా అనేది చూడాలి.  ఇక పోతే నాని ప్రస్తుతం దసరా మూవీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: