అందాల ముద్దుగుమ్మ చాందిని చౌదరి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలిం లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందినీ చౌదరి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

కొంత కాలం క్రితం విడుదల అయిన కలర్ ఫోటో సినిమాతో చాందినీ చౌదరి ప్రేక్షకులను చాలా బాగా అలరించింది. కలర్ ఫోటో సినిమా థియేటర్ లో కాకుండా నేరుగా ఆహా   'ఓ టి టి' లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే కలర్ ఫోటో సినిమాతో చాందిని చౌదరి ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన సమ్మతమే సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమా నిన్న అనగా జూన్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల  అయ్యింది. ఈ సందర్భంగా తాజాగా చాందినీ చౌదరి ఈ టివి లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే షో కి వెళ్ళింది. ఈ షో లో మాట్లాడుతూ చాందినీ చౌదరి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

ఆలీతో సరదాగా షో లో చాందిని చౌదరి మాట్లాడుతూ... చాందిని చౌదరి డేట్స్ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ మూడు సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టినట్లు , అతను పెద్ద ప్రొడ్యూసర్  అని , రెండు సంవత్సరాలకు అని ఒక ప్రాజెక్టు కు సైన్ చేయించుకొని , ఒక్క సీన్ కూడా తీయలేదు అని,  ఒక్క రూపాయి కూడా రెమ్యునిరేషన్ ఇవ్వలేదు అని, ఆ సమయంలో తాను ఊహలు గుసగుసలాడే, కుమారి 21ఎఫ్, పటాస్, దృశ్యం సినిమా అవకాశాలు వచ్చాయని, కానీ ఆ నిర్మాతకు ఎదురు తిరిగే ధైర్యం లేక ఆ సినిమాలను వదులుకున్నాను అని తాజా ఇంటర్వ్యూలో చాందినీ చౌదరి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: