టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. అంతేకాకుండా అటు హీరోగా డైరెక్టర్ గా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు . గడచిన కొంతకాలంగా ఎక్కువగా బాలీవుడ్ లోనే స్టార్ హీరోలతో బడా సినిమాలను చేస్తూ ఉన్నారు. దీంతో తాజాగా ప్రభుదేవా నటించడంపై మరొకసారి దృష్టి పెట్టాడని చెప్పవచ్చు డైరెక్టర్ ఇటీవల హిందీలో చేసిన పలు చిత్రాలు డిజాస్టర్ కావడంతో ప్రభుదేవా మళ్లీ నటనపై దృష్టి పెట్టాడు. తమిళంలో నటించిన తాజా చిత్రం మై డియర్ భూతం చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకి డైరెక్టర్ రాఘవన్ దర్శకత్వం వహించారు.



ఇక అంతే కాకుండా ఈ సినిమాలో రమ్యసంబినన్ ముఖ్యమైన పాత్రలో నటించారు ఈ సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగే విధంగా తెరకెక్కించడం జరిగింది. అభిషేక్ ఫిలిం బ్యానర్ పై రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో గ్రాఫిక్ తో చిన్నపిల్లలను అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఒకేసారి తెలుగులో తమిళంలో కూడా ఈ చిత్రం ఈనెల 15న విడుదల చేయబోతున్నారు.


జినీ గా ప్రభుదేవా ఈ సినిమాలో నటించాడు ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రభుదేవా ఈ సినిమాలోను చేసిన విన్యాసాలు గ్రాఫిక్ అంశాలు ముఖ్యంగా ఆకర్షించేలా కనిపిస్తున్నాయి ఒక బాబు కోసం బయటికి వచ్చిన జినీ తనకోసం ఏం చేస్తాడు ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తాడు అన్నది ఈ చిత్రకధాంశము. ఇక ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రభుదేవా చాలా కష్టపడినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గుండుతో ఉండే పిలక చాలా వెరైటీ గెటప్ లో ప్రభుదేవా కనిపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ అవుతాడమో ప్రభుదేవా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: