పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR).ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా నటించారు. అజయ్ దేవగణ్ (Ajay Devgan), ఆలియా భట్ (Alia Bhatt), ఒలివియా మోరిస్ (Olivia Morris) కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మార్చి 25 వ తేదీన విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బంపర్ హిట్‌గా నిలిచింది. రూ.1200కోట్ల భారీ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా హిందీ వెర్షన్ మే 20 వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఈ సినిమాను విదేశీ ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. అయినప్పటికీ, రాజమౌళి నెట్‌ఫ్లిక్స్ మీద ఆగ్రహంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నాడు. ఇక అందుకు కారణమేంటంటే..'ఆర్ఆర్ఆర్' సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంకా హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంటే,ఇంకా ఇతర భాషల హక్కులు 'జీ-5', 'డిస్నీ+హాట్ స్టార్' దగ్గర ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రుస్సో బ్రదర్స్ ఇంకా రాజమౌళి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడాడు.


నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు విదేశీ ప్రేక్షకుల నుంచి లభించిన ప్రశంసలు చూసి సర్‌ప్రైజ్‌కు లోనయ్యానని జక్కన్న రాజమౌళి చెప్పాడు. ఇక హిందీ వెర్షన్ హక్కులను మాత్రమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుందని, మిగిలిన నాలుగు భాషల హక్కులను తీసుకోకపోవడంతో ఆ ప్లాట్‌ఫాంపై ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొన్నాడు. ''ఓ మంచి కథ అనేది ప్రతి ఒక్కరికీ మంచి కథే. కానీ, విదేశీ ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా నేను సినిమాలు తీస్తానని అసలు అనుకోలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా స్ట్రీమింగ్ మొదలు కాగానే అందరు చూడటం ప్రారంభించారు. విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ ప్రేక్షకులకు సినిమా నచ్చడం చూసి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. కానీ, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రావడం వల్లే చాలా ఎక్కువ మంది చూశారు. అందుకు నెట్‌ఫ్లిక్స్‌కు నేను రుణపడి ఉంటాను'' అని రాజమౌళి చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్‌గా 'ఆర్ఆర్ఆర్' సినిమా 10వారాల పాటు ట్రెండ్ అయింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 47మిలియన్ గంటల పాటు ఈ చిత్రాన్ని వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR