ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే హీరోలుగా బాగా సక్సెస్ అయ్యారు. ఇలా నందమూరి వంశం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వారిలో హీరో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు.ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఓ గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇక చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇంకా టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో బింబిసార సినిమా ప్రమోషన్ పనులు కూడా మొదలుపెట్టారు.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాన్ రామ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుకోవడం జరిగింది.


ఇక ఈ క్రమంలో 'బింబిసార సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినట్టు అనిపిస్తుంది.బింబిసారా సినిమా గ్రాండియర్ లుక్ ఇంకా విఎఫ్ఎక్స్ పరంగా చూస్తే ఇది పెద్ద సినిమాగా అనిపిస్తుంది. బింబిసారను బాహుబలి లైన్ లో చేర్చి ఇక మరో బాహుబలి తర్వాత అంతటి బిగ్ మూవీ అనుకోవచ్చా?' అని యాంకర్ కళ్యాణ్ రామ్ ని ప్రశ్నించారు.ఇక ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ 'దయచేసి బింబిసార సినిమాని బాహుబలి సినిమాతో పోల్చకండి. ఆ సినిమా వందల కోట్ల భారీ బడ్జెట్ వరకు వెళ్ళింది. కానీ ఈ సినిమాని మేము మాకున్న బడ్జెట్ ఇంకా పరిధిలో రిచ్ గా రూపొందించాం.' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నారట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటించాడు. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: