విజయ్ వారసుడుకి స్ట్రైక్ షాక్! ఇక ఇవాళ్టి నుంచి టాలీవుడ్ షూటింగులు బందని నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ తో పాటు ఫిలిం ఛాంబర్ కూడా మద్దతు కూడగట్టుకుని నిర్ణయం ప్రకటించిన సంగతి అందరికీ కూడా తెలిసిందే.దిల్ రాజే స్వయంగా అనౌన్స్ చేయడంతో దాదాపుగా అన్ని చిత్రీకరణలు కూడా నిలిచిపోయాయి. విభేదిస్తున్న తెలంగాణ ఛాంబర్ తరఫున కొందరు చిన్న నిర్మాతలు అయితే యథావిధిగా తమ షూట్ లు చేసుకున్నారు.కానీ దిల్ రాజు నిర్మాణంలోనే రూపొందుతున్న తమిళ సినిమా వారసుడు(వారిసు) వైజాగ్ షెడ్యూల్ జరుగుతున్నట్టుగా వచ్చిన వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి ఈ సమాచారం తమకు తెలియదని ఒకవేళ నిజమైతే అలా చేయడం ముమ్మాటికి తప్పేనని కూడా అంటున్నారు. ఇంకా మరోవైపు ఎస్విసి టీమ్ ఇది తమిళ సినిమా కాబట్టి ఆ నిబంధన వర్తించదని చెబుతున్నారట.ఇది ఎంత అరవ చిత్రమైనప్పటికీ పని చేస్తున్న వాళ్ళు లోకల్ యూనిట్ కాబట్టి అంత ఈజీగా ఆ వాదనను సమర్ధింపుగా చెప్పలేం. 


ఎందుకంటే ఈ సినిమాని వారసుడుని ముందు నుంచి ప్యాన్ ఇండియా బై లింగ్వల్ గానే ప్రమోట్ చేస్తున్నారు. మరిప్పుడు ఇది సింగిల్ లాంగ్వేజ్ ఎలా అయ్యిందో.ఇక ఇప్పుడీ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. భాష ఏదైనా వారసుడులో అధిక శాతం కోలీవుడ్ ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు బంద్ చేయాలంటే కాల్ షీట్ల సమస్య కూడా రావొచ్చు. మరి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. హైదరాబాద్ లో ప్రధాన షూటింగులన్నీ కూడా ఆపేశారు కానీ చర్చలు, దాని తాలూకు ఫలితాలు ఇంకా డిస్కషన్లు రేపు ఎల్లుండి నుంచి మొదలవ్వొచ్చు. ఆగస్ట్ నెల నుంచి భారీ విడుదలలు మొదలైన తరుణంలో ఇప్పుడీ పరిణామాలు దసరా రిలీజుల మీద తీవ్ర ప్రభావం చూపించేలా కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: