టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న గ్లామరస్ నటీమణుల్లో ఒకరైన పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి నటిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకుంది. ఈ ముద్దు గుమ్మ కేవలం సినిమాలలో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా , సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటించి ఎన్నో సార్లు ప్రేక్షకులను అలరించింది. 

అలాగే పూర్ణ ఈ మధ్య కాలంలో ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  విడుదల అయిన త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్  లో కూడా నటించింది. అలాగే డీ డ్యాన్స్ పోగ్రామ్ కు కూడా పూర్ణ జడ్జిగా వ్యవహరించింది. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన పూర్ణ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ,  వెబ్ సిరీస్ లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ ఉండే పూర్ణ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా పూర్ణ తనకు సబందించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డీసెంట్ అండ్ క్లాస్ లుక్ లో సారీ కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ని ధరించి, మెడలో లాకెట్ లను వేసుకొని, నడుముకు వడ్డాణం పెట్టుకొని, చేతికి గాజులు వేసుకుని అదిరిపోయే రేంజ్ లో ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కి సంబంధించిన ఈ ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: