మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామమ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో భారీ తారాగణం ఇక సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే సీతారామమ్ సినిమాకు యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని పెట్టిన క్యాప్షన్ ఎంతో మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమా లోని ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.


 ఇప్పటికే ఎన్నో క్లాస్ లవ్ స్టోరీ లతో ప్రేక్షకులను మెప్పించిన హను రాఘవపూడి మరోసారి తనదైన శైలిలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తెరకెక్కించి ప్రేక్షకులను కూడా మెప్పించాడు అని చెప్పాలి. అయితే దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించింది మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదే మొదటి సినిమా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో ఇక వరుస అవకాశాలు రావడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే సీతారామమ్ సినిమాలో ముందుగా మృణాల్ ఠాకూర్ ని తీసుకోవాలని అనుకోలేదట దర్శకనిర్మాతలు.


 ముందుగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ను  ఈ పాత్రకోసం తీసుకుంటే బాగుంటుందని భావించారట. కానీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయిందట. దీంతో ఈ సినిమాకి సున్నితంగా నొ చెప్పినట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలోని పాత్ర మాత్రం పూజా హెగ్డేకు  బాగా నచ్చేసిందట. చివరికి పూజా హెగ్డే మిస్ చేసుకున్న ఈ పాత్ర మృణాల్ ఠాకూర్ కి దక్కింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా హౌస్ ఫుల్ షో దూసుకుపోతుంది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయంగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: