విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తుంది చిత్ర బృందం. ఆ విధంగా ఈ సినిమా పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తప రుస్తున్న చిత్ర బృందం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కొన్ని సినిమాలను ఒప్పుకున్న విషయం తెలిసింది. వాటిలో ఒకటి ఖుషి.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుంది. సమంత కథానాయకగా నటిస్తుంది. ప్రేమ కథ సినిమా గా రూపొందిన ఈ చిత్రం యొక్క విడుదల డిసెంబర్ 23వ తేదీన జరుగుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున విడుదల అయ్యే విధంగా సిద్ధం లేనట్లుగా తె లుస్తుంది. దానికి కారణం ఇ ప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న స్ట్రైక్ ఏ కారణం. చాలా రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్లో నిర్వహించబడటం లేదు. ఒకరు తర్వాత మరొకరు స్ట్రైక్ లు నిర్వహించ డం సినిమా షూటింగులు ఆగిపోవడానికి కారణం. 

మరికొన్ని రోజులు ఇలాగే జరిగితే మాత్రం విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం అనుకున్న సమయానికి రావడం జరగదు అని చెప్పాలి. ఇప్ప టికే లైగర్ సినిమా కోసం ఆ చిత్రం యొక్క ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ అన్ని చోట్లా తిరుగుతున్నాడు. దాంతో ఖుషి షూటింగ్ కి పెట్టాల్సిన సమయాన్ని దీనికి పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా ఖుషి సిని మా పోస్ట్ పోన్ అవడానికి ఎక్కువ అవకాశాలని కల్పిస్తుంది. మరి ఈ సినిమా కొత్త విడుదల తేదీనీ ఎప్పుడు నిర్ణయిస్తారో చూడాలి. త్వరలో నే దీనిపై ఒక స్పష్టత ను ఇచ్చే అవకా శం కలిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: