ఆతరువాత విడుదలైన ‘ఆచార్య’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో షాక్ కు గురైన చరణ్ పెద్దగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. సినిమా ఫంక్షన్స్ లో కూడ రామ్ చరణ్ గత కొంత కాలంగా ఎక్కడా కనిపించడం లేదు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత కొమరం భీమ్ పాత్రను ఎంతో కష్టపడి నటించిన జూనియర్ కు సగటు ప్రేక్షకుడి నుండి పెద్దగా చెప్పుకోతగ్గ ప్రశంసలు లభించక పోవడంతో జూనియర్ కొంతకాలం మీడియాకు దూరంగా ఉన్నాడు.
అయితే ఒకసారి సీన్ రివర్స్ అయినట్లుగా జూనియర్ కొమరం భీమ్ పాత్రకు ప్రశంసలు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా భారీ స్థాయిలో వచ్చి పడుతున్నాయి. దీనికితోడు తారక్ ఆస్కార్ అవార్డుల బరిలో నిలబడబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు అతడి అభిమానులకు మాత్రమే కాకుండా జూనియర్ సన్నిహితులకు కూడ జోష్ ను కలిగిస్తున్నాయి. దీనికితోడు ఈమధ్య తారక్ కు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం నుండి ప్రశంసలు రావడంతో ఒక్కసారిగా జూనియర్ మ్యానియా పెరిగి పోయింది.
దీనికి భిన్నంగా రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఒకవైపు జూనియర్ సినిమా ఫంక్షన్స్ కు అతిధిగా వస్తూ తన స్పీడ్ ను పెంచుతూ ఉంటే చరణ్ మాత్రం మీడియాతో కలవకుండా కొంచం దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనితో చరణ్ వ్యూహాలలో మార్పులు వచ్చాయా లేకుంటే కావాలని కొంతకాలం మీడియాకు దూరంగా ఉండాలని చరణ్ భావిస్తున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి