నయనతార తెలుగులో వరుస సినిమాలను ఒప్పుకోవడం ఆమె అభిమానులను ఎంతగానో ఆనందపరుస్తుంది. ఇప్పటికే ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం దసరా కానుకగా తొందర్లోనే విడుదల కాబోతుంది. ఇటీవల ఆమెకు వివాహం అయిన నేపథ్యంలో ఈ వివాహం తర్వాత హీరోయిన్లు ఎవరూ కూడా సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు కాబట్టి ఈమె కూడా సినిమాలలో నటిస్తుందో లేదో అన్న అనుమానాలను ఆమె అభిమానులు వ్యక్తపరిచారు.

కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస సినిమాలు చేయడం ఒకసారిగా అందరిలో ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ విధంగా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా వరుస చిత్రాలు చేయడానికి రంగం సిద్ధం చేయడం మరింత విశేషం. తాజాగా ఆమె బాలకృష్ణ హీరోగా నటించబోయే ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిందని వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 

త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చాయి. ఆ విధంగా ఇప్పుడు మరొకసారి నయనతార బాలకృష్ణతో కలిసి నటించడం విశేషం. ఇప్పటివరకు ఇది కేవలం పుకారు అనే ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. తొందర్లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ మనలను పూర్తి చేసిన అనిల్ రావిపూడి అక్టోబర్ నుంచి ఈ సినిమా యొక్క షూటింగ్ను మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను త్వరలోనే పూర్తి చేయనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల చేస్తుండగా ఈ సినిమా ను అక్టోబర్ లో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: