మాటల మాంత్రికుడు త్రివిక్రం అల వైకుంఠపురములో సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని పవన్ సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంలో బిజీ అయ్యాడు. భీంలా నాయక్ సినిమాకు డైరక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం మాత్రమే చేయగా మిగతా కథ అంతా నడిపించింది త్రివిక్రం అని అందరికి తెలిసిందే. ఇక ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

మహేష్ త్రివిక్రం కాంబో హ్యాట్రిక్ సినిమా వస్తుంది. ఈ సినిమా బాక్సులు బద్ధలు కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు చిత్రయూనిట్. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రం అసలైతే ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ తారక్ బదులుగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని టాక్. ఇప్పటికే బన్నీతో మూడు సినిమాలు చేసి మూడింటితో సూపర్ హిట్ అందుకున్నారు త్రివిక్రం. ఇక ఇప్పుడు ఈ కాంబోలో నాల్గవ సినిమా రాబోతుందని టాక్.

పుష్ప 2 తర్వాత త్రివిక్రం తోనే పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉన్నాడట అల్లు అర్జున్. ఈమధ్యనే త్రివిక్రం కలిసి కథ చెప్పడం బన్నీ ఓకే చేయడం అంతా జరిగిందట. పుష్ప తో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ త్రివిక్రం సినిమాతో కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి త్రివిక్రం మహేష్ మూవీ కాగానే ఆ వెంటనే బన్నీని లైన్ లో పెట్టినట్టు అర్ధమవుతుంది.  సూపర్ స్టార్ మహేష్ తో తీస్తున్న సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మహేష్ మాత్రం కేవలం సౌత్ వరకు రిలీజ్ చేయాలని అంటున్నాడట. సినిమా రిలీజ్ టైం లో ఈ మూవీ కూడా పాన్ ఇండియా ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. మహేష్ తో ఈ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: