కోలీవుడ్లో స్టార్ హీరోగా రజనీకాంత్ ఎంతటి పేరు సంపాదించారో టాలీవుడ్ లో కూడా అంతే పేరును సంపాదించారు. రజనీకాంత్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఐశ్వర్య రజనీకాంత్.. అయితే ఇమే ఇండస్ట్రీలో కేవలం దర్శకురలిగా, నిర్మాతగా మాత్రమే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరో ధనుస్ తో ఈమె ప్రేమాయణం కొనసాగించి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకుంది. అయితే 18 సంవత్సరాల పాటు వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు.కానీ ఈ ఏడాది మొదట్లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో ఒకసారి షాక్ అయ్యారు.ఆ విధంగా వీరిద్దరూ 18 సంవత్సరాల పాటు చాలా సంతోషంగా గడిపిన వీరు విడిపోవడంతో అభిమానుల సైతం కాస్త జీర్ణించుకోలేకపోయారు. ఇక దర్శకురాలిగా ఐశ్వర్య ఇండస్ట్రీలో ధనుష్ నటించిన పలు చిత్రాలకు కూడా ఇమే దర్శకత్వం వహించింది. కానీ ఈమె మాత్రం దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నది. అయితే ప్రస్తుతం తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో ఈమె ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ కేవలం తన పిల్లల బాగోగులను మాత్రమే చూసుకుంటూ ఉన్నది. ఇక ఇలాంటి సమయంలోనే తిరిగి ఐశ్వర్య మళ్ళీ ఇండస్ట్రీ లోకి ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.


అయితే ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మెగా హీరోతో సినిమా తీసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోని ఐశ్వర్య లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నటువంటి సినిమాకి ఈమె దర్శకురాలుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ కూడా ఒక కీలకమైన పాత్రలో అతిథి పాత్రలు కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా అప్డేట్ చేయలేదు. త్వరలోనే అన్ని విషయాలను లైకా ప్రొడక్షన్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ఐశ్వర్య రీఎంట్రీ ఇస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: