అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ ఆఖరుగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఏజెంట్ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది.

మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  హిప్ హాప్ తమిజా ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం ,  ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతూ ఉండడంతో ,  ఈ మూవీ కి అద్భుతమైన బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఏజెంట్ మూవీ త్రీయేటికల్  మరియు నాన్  త్రియేటికల్ హక్కులు అన్నింటితో కలిపి 100 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ ను జరుపుకున్న మూవీ గా రికార్డ్ సృష్టించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: