రాజమౌళి సినిమాలలో నటించే హీరోలు చాల త్యాగాలు చాల కష్టాలు పడవలసి వస్తుంది. ‘బాహుబలి’ లో ప్రభాస్ రానా లు నటిస్తున్నప్పుడు వారి లుక్ లో పూర్తి మార్పులు తీసుకు రావడానికి ఏకంగా రానా ప్రభాస్ లతో రోజుకు 20 కోడి గుడ్లు తినే స్థాయిలో వారిని మార్చుకున్నాడు.


‘ఆర్ ఆర్ ఆర్’ జూనియర్ చరణ్ లను డిఫరెంట్ లుక్ లో చూపించడానికి జూనియర్ కు గుబురు గడ్డం చరణ్ కు డిఫరెంట్ మీసకట్టు తో పాటు వారిద్దరి ఫిజిక్ లో విపరీతమైన మార్పులు తీసుకు వచ్చి సిక్స్ ప్యాక్ బాడీ లతో చాల డిఫరెంట్ గా చూపించాడు. దీనితో వచ్చే సంవత్సరం ప్రారంభంకాబోతున్న మహేష్ రాజమౌళిల మూవీలో మహేష్ ఎలాంటి గెటప్ తో కనిపిస్తాడో మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపించడానికి ఒప్పుకున్నాడా అన్నసందేహాలు చాలామందికి ఉన్నాయి.


ఇప్పుడు ఆ సందేహాలకు రాజమౌళి అమెరికాలో తనను కలిసిన కొందరు ప్రముఖ ఎన్ఆర్ఐ లకు జక్కన్న చెప్పిన మాటలతో సమాధానాలు దొరికినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం తాను మహేష్ తో తీయబోతున్న మూవీ కథ ‘ట్రావెల్ ఎడ్వంచర్’ అని అది దట్టమైన ఆఫ్రికా అరణ్యాల నేపధ్యంలో ఈమూవీ కథ ఉంటుందని చెప్పినట్లు టాక్. అయితే ఈమూవీలో మహేష్ లుక్ లో ఎటువంటి మార్పులు ఉండవని కేవలం కొద్దిగా హెయిర్ స్టైల్ మాత్రం మార్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం.


ఇక ఈసినిమా బడ్జెట్ ఇప్పటివరకు తాను తీసిన సినిమాల బడ్జెట్ కంటే చాల ఎక్కువగా ఉంటుందని వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ప్రారంభం అయ్యే ఈమూవీ 2024లో విడుదల అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ కథకు సంబంధించి కేవలం లైన్ మాత్రమే అనుకున్నామని ఇంకా ఈమూవీ స్క్రిప్ట్ పూర్తి అవ్వడానికి చాల సమయం పట్టే ఆస్కారం ఉంది అని కూడ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తో సినిమా అంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే నేపద్యంలో ఈమూవీ 2025లో విడుదలైన ఆశ్చర్యం లేదు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: