2007లో విడుదలైన ఈ చిత్రం అల్లు అర్జున్ హీరోఇజం డైలాగ్స్ అందరిని కూడా ఆకట్టుకున్నాయి అల్లు అర్జున్ కెరీర్ లోని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది మరొకసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అల్లు అర్జున్ పుట్టిన రోజున ఏప్రిల్ 8వ తేదీన 4k టెక్నాలజీతో ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. గతంలో ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ తదితర హీరోల చిత్రాలు కూడా ఇలానే మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.2007 లో 500కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 175 రోజులు ఆడిన ఈ సినిమా మలయాళం లో డబ్బు చేసి విడుదల చేయగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయారు. పుష్ప -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని కూడా ఎంతో భారీ బడ్జెట్ తో పగడ్బందీగా తెరకెక్కిస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి