
లాస్ ఏంజిల్స్ లో ఈరోజు 95 వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతున్న సందర్భంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న రాజమౌళి ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంటున్నారు.. ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడంతో అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ,దర్శకులు, నటీనటులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నామని గత కొన్ని రోజులు క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ను రివీల్ చేశారు రాజమౌళి.. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతోందని రాజమౌళి తండ్రి.. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో రాణా కూడా భాగం కానున్నాడు అంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో రానాకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాతో ఇంటర్నేషనల్ ఇమేజ్ లభించడం ఖాయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.