తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇప్పటికి కూడా సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సమంత "యశోద" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో సమంత నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. యశోద మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న సమంత తాజాగా శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది.

 ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లని ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం సమంత కు ఒరిజినల్ బంగారు నగలను ... అలాగే ఒరిజినల్ డైమండ్స్ ను వాడినట్లు తెలుస్తుంది. వీటి ఖరీదు దాదాపుగా 14 కోట్లగా ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: