నాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ  భాషలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల్లో నైజం ఏరియాలో ఈ మూవీ 10.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 3.02 కోట్లు , యు ఏ లో 2.06 కోట్లు , ఈస్ట్ లో 1.18 కోట్లు , వెస్ట్ లో 71 లక్షలు , గుంటూరు లో 1.46 కోట్లు ,  కృష్ణ లో 92 లక్షలు , నెల్లూరు లో 47 లక్షలు.  మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 20.08 కోట్ల షేర్ ... 34.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.15 కోట్లు , ఇతర భాషలలో 65 లక్షలు , నార్త్ ఇండియాలో 60 లక్షలు , ఓవర్సీస్ లో 5.60 కోట్లు మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రెండు రోజుల్లో 29.08 కోట్ల షేర్ ... 52.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: