తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో శివ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లకు దర్శకత్వం వహించి అలాగే ఎన్నో అద్భుతమైన విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరో గా తాప్సి హీరోయిన్ గా రూపొందిన దరువు అనే తెలుగు మూవీ కి దర్శకత్వం వహించాడు.

 మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా దరువు మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయిన శివ ఆ తర్వాత తెలుగు లో ఇప్పటి వరకు ఏ మూవీ కి దర్శకత్వం వహించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి సూర్య హీ రోగా ఒక మూవీ ని రూపొందిస్తున్నాడు.

 ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ షూటింగ్ ను సూర్య 42 అనే టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఈ మూవీ ని 10 భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: