టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటే.. బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ వైపు దృష్టి పెడుతున్నారు. మామూలుగా టాలీవుడ్ హీరోయిన్ల కంటే బాలీవుడ్ హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

దాంతో మన హీరోయిన్లు బాలీవుడ్ లో సెటిల్ అవ్వచ్చు కానీ.. ఆ హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ లో సెటిల్ అవ్వటం చాలా కష్టం. పైగా రెమ్యూనరేషన్ విషయంలో కూడా అస్సలు తగ్గరు ఆ హాట్ బ్యూటీస్. అయినా కూడా తెలుగు నిర్మాతలు వారికి మరింత ఎక్కువ డబ్బు పోసైన కూడా అవకాశాలు కల్పిస్తూ ఉంటారు.

ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో అడుగు పెట్టి తమ డిమాండ్ తో బాగానే సంపాదించుకొని పోయారు. అది కూడా కేవలం ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే అన్నట్లుగా నటిస్తారు తప్ప పూర్తిగా ఇక్కడే సెటిల్ అవ్వడానికి ఇష్టపడరు. అయితే ఇదంతా పక్కన పెడితే త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే ఎంట్రీ తోనే ఈ ముద్దుగుమ్మ పెద్ద బాంబ్ పేల్చినట్లు తెలుస్తుంది. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.బాలీవుడ్ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి సొంతం చేసుకున్న క్రేజ్ ను తాను కూడా సొంతం చేసుకునే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది జాన్వీ. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. చాలా వరకు స్టార్ హోదా ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక తన అందాలతో మాత్రం గ్లామర్ విందునే వడ్డిస్తుంది ఈ హాట్ బ్యూటీ. హాలీవుడ్ హీరోయిన్స్ వలే గ్లామర్ షో చేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది. తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది.ఈ బ్యూటీ మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించగా.. రాను రాను గ్లామర్ షోతో బాగా రెచ్చిపోతుంది. గతంలో కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా మరింత యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడున్న షెడ్యూల్ లో జాన్వీతో షూటింగ్ నడుస్తోంది. అయితే తొలి సినిమాతోనే ఆమె దారుణమైన ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. కారణం ఏంటంటే.. ఈ సినిమా కోసం జాన్వీకి రు. 4 కోట్లు ఇస్తామని ముందు మేకర్స్ అడగగా ఆమె కాదని రూ. 5 కోట్లకు తక్కువ అయితే తాను డేట్లు ఇవ్వలేనని డిమాండ్ చేయగా సచ్చినట్లు ఒకే అన్నారట. అంతేకాకుండా తనకు ఇద్దరు అసిస్టెంట్లతో పాటు వారి సౌకర్యాల భారం కూడా నిర్మాతల మీదే పడుతోంది. అంటే ఈ లెక్కన ఆమెకే రెమ్యునరేషన్ అన్నీ కలుపుకుంటే రు. 6 కోట్లు దాటిపోతోంది. ఇక ఈమె ఇంతా డిమాండ్ చేయటంతో ఇకపై ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడం కష్టమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: