ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో ఎక్కువ శాతం మంది నటించిన మొదటి సినిమాతో అంత పెద్దగా గుర్తింపు సాధించుకోరు. చాలా తక్కువ మంది మాత్రమే మొదటి సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటారు. అలా మొదటి సినిమా తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ ముద్దు గుమ్మ బుచ్చిబాబు సన అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ అనే కొత్త నటుడు హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కృతి తన అద్భుతమైన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ మూవీ ద్వారా కృతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తరువాత వరుసగా ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి  తాజాగా కస్టడీ మూవీ లతో వరసగా ఆపజాయలను అందుకుంది.

దానితో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం కృతి ... శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఈ మూవీ తప్ప తెలుగులో మరే మూవీ కి కూడా ఇప్పటి వరకు కృతి సేన్ చేయలేదు. దీనితో ఉప్పెన విజయాన్ని ఈ ముద్దుగుమ్మ సరిగ్గా వినియోగించుకోలేదు అని పలువురు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: