సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల , పూజా హెగ్డే హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

దానితో ఇన్ని రోజుల పాటు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా షూటిం నుగ్ "ఎస్ఎస్ఎంబి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను విడుదల చేస్తూ ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ వీడియోలో మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండడం ... అందులో బీడీ కాలుస్తూ ... బీడీ త్రీడీలో కనబడుతుందా అంటూ చమత్కారంగా డైలాగులు చెప్పడం ప్రేక్షకులను అత్యంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

దానితో ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రేంజ్ వ్యూస్ లభించాయి. ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు 24 గంటల సమయంలో 20.98 మిలియన్ న్యూస్ లభించాయి. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు కూడా రాని వ్యూస్ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వీడియోకు వచ్చాయి. దాంతో ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. అలాగే ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్  వీడియోకు 348 కే లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: