ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తన క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలతో పోల్చి చూస్తే అటు పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే. ఇక ఈ సినిమాలలో సూపర్ హిట్ అయింది కూడా తక్కువే అని చెప్పాలి. కానీ ఇక అటు అభిమానుల విషయానికి వస్తే మాత్రం మిగతా హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.


 పవన్ కళ్యాణ్ కి అభిమానులు కాదు అందరూ వీరాభిమానులే ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలను చూసి అభిమానులుగా మారిన వారి కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఇక అభిమానించడం మొదలుపెట్టిన ప్రేక్షకులే ఎక్కువగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలలో అటు తీన్ మార్ సినిమా కూడా ఒకటి.


 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా ఫ్లాప్ అవడం గురించి ఈ మూవీ డైరెక్టర్ జయంత్ సి పరాంజి కీలక వ్యాఖ్యలు చేశాడు. తీన్మార్ సినిమా ఇప్పటికీ కూడా ఫ్రెష్ లవ్ స్టోరీ లాగే అనిపిస్తుంది. అయితే పవర్ స్టార్ ఇమేజ్ కి ఇది సెట్ కాలేదు. త్రిషకు సోనుసూద్ పెళ్లి చేయడం.. త్రిష మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి రావడం ప్రేక్షకులకు నచ్చలేదు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో ఈ సినిమా చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అంటూ డైరెక్టర్ జయంత్ సి పరంజి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: