రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క మొదటి భాగం కు సంబంధించిన ప్రభాస్ షూటింగ్ భాగం ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగినటు వంటి ప్రభాస్ ఈ సినిమాలో హీరో గా నటిస్తూ ఉండడం ... కే జి ఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా నుండి చిత్ర బృందం ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న కొంత మంది పోస్టర్ లను మరియు ఈ సినిమాలో హీరో , హీరోయిన్ లుగా నటిస్తున్న వారి పోస్టర్ లను మినహాయించి ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదల చేయలేదు.

దానితో ఈ మూవీ టీజర్ ను ఈ మూవీ బృందం ఎప్పుడు విడుదల చేస్తుందా అని చాలా మంది సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతతో , ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్ ను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా టీజర్ ను 1 నిమిషం 31 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: