టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు ఆఖరిగా కృష్ణ వ్రిందా భిహరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా కృష్ణా వ్రింద విహారి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం రంగబలి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క టీజర్ ను జూన్ 8 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగ శౌర్య అదిరిపోయే స్టైలిష్ లుక్ లో కాలుపై కాలు వేసుకొని కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: