తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి మహేష్ బాబు ... జూనియర్ ఎన్టీఆర్ ... రవితేజ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వాటి షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రదేశాల్లో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లేస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ పరసర ప్రాంతాల్లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో మహేష్ బాబు పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివసినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ టీ స్టూడియో ... శంషాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రాత్రి వేళ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: