నవమన్మధుడిగా ఆరుపదుల వయసులో కూడా అదే పేరుతో చలామణి అవుతున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇదిలా వుండగా తాజాగా ఆయన లుక్ కి సంబంధించి నెట్టింట వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలే ఒక మోషన్ వీడియోని రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వహకుల. స్టార్ మా లో బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది కాబట్టి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ అవనుంది. బిగ్బాస్ మూడో సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.
అయితే ఇప్పుడు సీజన్ సెవెన్ కి ఎవరు హోస్ట్ గా రాబోతున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో షో ఎప్పుడు మొదలవుతుంది? ఎవరెవరు కంటెస్టెంట్లుగా వస్తారు? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున రాబోతున్నారని సమాచారం.  ఇక ప్రోమో షూట్ కూడా నాగార్జున పూర్తి చేశారని.. ఈ షూట్ నుంచి నాగార్జునకు సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా బిగ్ బాస్ కి సంబంధించిన ఫోటో అని తెలియక పోయినప్పటికీ కూడా సీజన్ సెవెన్ లో పాల్గొనబోయేది వీళ్లే అంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే సెట్ వర్క్ కూడా పూర్తవుతుందని.. ఆగస్టు మొదటి వారంలో ప్రోమో రిలీజ్ చేసి సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం.ఇందులో తేజస్విని, అమర్దీప్ జంట, శోభిత శెట్టి , జబర్దస్త్ పార్వతి, పండు, అప్పారావు, సందీప్, శ్వేతా నాయుడు, నిఖిల్, బ్యాంకాక్ పిల్ల, శశి తదితర పేర్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: