శ్రీముఖి యాంకర్ గా బుల్లితెర స్టార్స్ ను ఓ ఆట ఆడేసుకుంది. అంతే కాదు వారు కూడా పంచ్ లతో శ్రీముఖిని ఆడేసుకున్నారు. ఈక్రమంలో శ్రీముఖి కమెడియన్ ముక్కు అవినాశ్ చెప్ప చెల్లుమనిపించింది. దాంతో అంతా.. ఒక్క సారిగా షాక్ అయ్యారు. శ్రీముఖి.. డైలాగ్ చెపుతూ.. పార్థు... ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంది. ఇక శ్రీముఖి అలా అనేసరికి.. అవినాష్ రెచ్చిపోయి ముద్దు పెట్టుకోబోయాడు. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయి నిజంగానే శ్రీముఖిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు అవినాశ్. దాంతో తన స్టైల్లో ఒక్కటిచ్చింది శ్రీముఖి. అయితే సరదాగా కొట్టాలని చూసినా.. ప్లోలో శ్రీముఖి కాస్త గట్టిగానే కొట్టింది. దాంతో అవినాశ్ గూబ గుయ్ మనిపించింది. శ్రీముఖి, అవినాష్‌ని కొట్టినప్పుడు వచ్చిన సౌండ్ తో అంతా షాక్ అయ్యారు. సర్‌ప్రైజ్‌కి గురయ్యారు. పెద్దగా నవ్వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి