చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడంతో అభిమానులు సైతం జల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో రజనీకాంత్ చేసిన ఒక పని పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. అదేమిటంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు రజనీకాంత్ సైతం నమస్కరించడం పట్ల కొంతమంది నేటిజన్లు సైతం ట్రోల్ చేయడం జరుగుతోంది. జైలర్ సినిమా విడుదలకు ముందే రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రలకు సైతం వెళ్లడం జరిగింది.. అప్పటినుంచి ఆ యాత్ర అలాగే కొనసాగిస్తూ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలవడం జరిగింది రజనీకాంత్.


జైలర్ సినిమా చూసేందుకు ఆయనతో కలిసి లగ్నోకి వెళ్లారు.. అయితే ఆ సమయంలో ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చేసిన రజినీకాంత్ అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఆదిత్యనాథ్ కాళ్ళకు నమస్కరించడం ద్వారా తన సొంత ప్రతిష్టను రజనీ కాంత్ దిగజారుతున్నారని ఒక నేటిజన్ కామెంట్స్ చేయడం జరిగింది. రజినీకాంత్ ఎందుకిలా చేస్తున్నావ్ అంటూ మరొక యూజర్ రాసుకు రావడం జరిగింది. వయసులో తన కంటే చిన్నవాడైన యోగి కాళ్లకు నమస్కరించడం కరెక్టేనా అంటూ రజనీకాంత్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు.


మరి కొంతమంది రజినీకాంత్ చేసిన గతంలో ఒక వీడియోని వైరల్ గా చేస్తున్నారు.. దేవుడు తల్లి తండ్రికి వీరికి మాత్రమే పాదాభివందనం చేయండి కేవలం ధనం ఫేమ్ అధికారం ఉందని కారణాలతో ఎవరికీ కాళ్లకు దండం పెట్టకండి అంటూ 2017లో రజనీకాంత్ ఒక ప్రసంగంలో తెలియజేశారు. ఇప్పుడు యోగి రజినీకి పాదాభివందనం చేయడంతో ఈ స్పీచ్ వైరల్ గా మారుతోంది. చిరంజీవి కూడ జగన్ పై గత కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రదుమారాన్ని రేపాయి గతంలో కూడా చిరంజీవి ఏపీ సీఎం జగన్ తమని అన్నలా భావించి తమ ఎంతో ఆప్యాయంగా పలకరించారని విషయాలను కూడా తెలియజేశారు. అయితే అప్పుడు కూడా చిరంజీవి పైన ట్రోల్స్ వినిపించాయి ఇప్పుడు రజనీకాంత్ పైన కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: