తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన తాజా సినిమా మార్క్ ఆంటోని. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన విడుదల అయింది. చాలా కాలం తరువాత విశాల్ కి ఈ సినిమాతో హిట్ పడింది. ఈ సినిమా తమిళంలో సాలిడ్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుండగా తెలుగులో కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఇక మార్క్ ఆంటోనీ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.విశాల్ మార్క్ ఆంటోని సినిమాను మొత్తం 2900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తం 40 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ గా సినిమా బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. తొలి రోజు ఇండియాలో 8.35 కోట్ల రూపాయల వసూళ్ళని ఈ సినిమా రాబట్టింది. ఇక తెలుగు వెర్షన్ 1.15 కోట్ల షేర్ వసూలు చేస్తే.. తమిళ వెర్షన్ 7.2 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ ని ఈ సినిమా కొనసాగించింది.తమిళంలో 8.1 కోట్ల రూపాయలు ఇంకా తెలుగులో 90 లక్షల షేర్ వసూలుచేసింది.అలాగే మూడో రోజు కూడా తమిళ వెర్షన్‌లో ఏకంగా 9.59 కోట్లు, తెలుగులో 85 లక్షల షేర్ వసూలు చేసింది.


దాంతో ఈ సినిమా మొత్తంగా మూడో రోజు 10.44 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా 4వ రోజు తెలుగులో 1.4 కోట్ల గ్రాస్ ను అందుకోగా 5వ రోజు మాత్రం కలెక్షన్లు తగ్గాయి.దీనితో కేవలం రూ.60 లక్షల గ్రాస్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది. ఇక అందులో రూ.32 లక్షలు షేర్ ని అందుకుంది.ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం కలెక్షన్స్ గమనిస్తే... తమిళనాడులో మొత్తం రూ. 34.20 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.95 కోట్లు వసూలు చేయగా... కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం రూ.5.45 కోట్లు రాబట్టింది.ఓవర్సీస్ లో మొత్తం రూ.10.55 కోట్లు వసూలు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 56.15 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రూ.27.35 కోట్ల షేర్ ని రాబట్టింది. మొత్తం మీద ఈ సినిమా 5వ రోజు తెలుగులో కొంచె కలెక్షన్లు తగ్గినా కూడా తమిళ్ లో మాత్రం భారీగా వసూళ్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: