ఇటీవల డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో కూడా  చాలా సార్లు డ్రస్ వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది.రీసెంట్ గా  డ్రగ్స్ వాడకంలో సీపీ నవదీప్ పేరును ప్రస్తావించారు కూడా. కానీ అది తాను కాదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు నవదీప్.తాజాగా నవదీప్‌ పిటిషన్‌ పై హైకోర్టు విచారణ ముగిసింది.41ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరుకావాలని కూడా నవదీప్‌ ను హైకోర్టు ఆదేశించింది.అదేవిధంగా నవదీప్‌పై గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నాయని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. 

గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ కోర్ట్ లో వాదించారు. గతంలో కూడా దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయిన విషయం అడ్వకేట్ సిద్దార్థ్ తెలిపారు.మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని అడ్వకేట్ ఎంతో స్ట్రాంగ్ గా వాదించారు.డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తెలిపారు.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఏమి సంబంధం లేదంటూ మొదట బుకాయించే ప్రయత్నం చేసాడు నవదీప్. పోలీసులు ఎందుకు తన పేరు తీసుకు వచ్చారో తెలియడం లేదని, మీడియా సమావేశంలో పోలీసులు తెలిపిన పేరు తనది కాదంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు  కూడా పెట్టాడు నవదీప్.. అయితే నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు సోదాలు కూడా నిర్వహించారు. దాంతో నవదీప్ హైకోర్టు ను ఆశ్రయించాడు. అయితే ఇటీవల పోలీసుల దర్యాప్తు కు నవదీప్ స్పందించ లేదు.

తాజాగా హైకోర్టు ఆదేశాల తో పోలీసుల విచారణకు నవదీప్ సహకరిస్తాడో లేదో చూడాలి.. నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ వద్ద పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రీసెంట్ గా హై కోర్ట్ ఆదేశాల మేరకు డ్రగ్స్ కేసులో విచారణకు నవదీప్ సహకరించకుంటే అరెస్ట్ చేస్తామని నార్కోటిక్ పోలీసులు నవదీప్ కు వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: