టాలీవుడ్ లోకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంట్రీ వచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమా చేసిన తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాను తెరకెక్కించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు తాజాగా రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫ్రీ టీజర్ అదిరిపోయిందని చెప్పవచ్చు. మాస్క్ పెట్టుకొని ఊచ కోత కోస్తున్న రుణబీర్ ను చూసిన ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇక దీంతో ఈ సినిమా టీజర్ పైన మరింత ఆసక్తి నెలకొంటోంది. పాన్ ఇండియా టీజర్ కోసం అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ బయటికి రావడం జరిగింది అదేమిటంటే ఈ సినిమాలో నటిస్తున్న రష్మిక ఫస్ట్ లుక్ ను రివిల్ చేయడం జరిగింది మేకర్స్.


రీసెంట్గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ ని రివిల్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అనిల్ కపూర్ ఈ చిత్రంలో బల్బర్ సింగుగా కనిపించబోతున్నారు. ఇక తాజాగా రష్మిక లుక్కుని రివిల్ చేయగా ఇందులో చాలా కూల్ గా సింప్లీ హోమ్లీ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోంది నిండిన చీరలో పక్క నార్త్ అమ్మాయిల కనిపిస్తున్న రష్మిక యానిమల్ చిత్రంలో గీతాంజలి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది. రష్మిక ఎంత సాంప్రదాయంగా కనిపించినప్పటికీ ఈమె పైన ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మరి  ట్రోలర్లకు ఈ సినిమాతో రష్మిక చెక్ పెడుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: