తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ క్రేజ్ కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన ఇప్పటివరకు ఏ క్లాస్ సినిమాను కూడా తెరకెక్కించలేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన మూవీ అంటే మినిమం యాక్షన్ సన్నివేశాలు ఉండాల్సిందే. ఇకపోతే జనాలు కూడా ఈయన సినిమాకు వెళ్లాలి అని అనుకుంటే యాక్షన్ సన్నివేశాలు కచ్చితంగా భారీ లెవల్లో ఉంటాయి అని కూడా కచ్చితంగా ఫిక్స్ అవ్వాల్సి ఉంటుంది.

ఇక అంతటి రేంజ్ మాస్ యాక్షన్ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ దర్శకుడు తాజాగా రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇకపోతే ఈ సినిమాకి అటు బోయపాటి కి ఇటు రామ్ కి ఇద్దరికీ కూడా మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఐదు యాక్షన్స్ సన్నివేషాలు ఉండబోతున్నట్లు ... అవి కూడా భారీ నిడివితో అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలకు పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: