తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విక్రమ్ కొంత కాలం క్రితం కోబ్రా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత పోనియన్ పార్ట్ 1 ... పార్ట్ 2 మూవీ లలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ "ధ్రువ నక్షత్రం చాప్టర్ 1 యుద్ధ కండం" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ కి అద్భుతమైన దర్శకుడు గా ... నటుడి గా గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో రీతు వర్మ , ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని నవంబర్ 24 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ఈ చిత్ర బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే విక్రమ్ , గౌతమ్ మీనన్ కాంబో లో పొందుతున్న మూవీ కావడం ... ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: