ప్రముఖ తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే చాలా తక్కువ సమయం లోనే ఆఫ్ సెంచరీ కొట్టేసి అరుదైన రికార్డు సృష్టించింది.అది కూడా ప్రస్తుతం ఆమె చేయబోతున్న గీతాంజలి సీక్వెల్ తో అని చెప్పవచ్చు. ఇప్పటికే మంచి పాపులారిటీ మెయింటైన్ చేస్తున్న అంజలి అరుదైన మైలురాయిని దాటిన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను, బాధలను, వివాదాలను అధిగమించి ప్రస్తుతం ఆఫ్ సెంచరీ పూర్తి చేసింది.తన అందంతో , నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మను ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకుంటున్నారని చెప్పాలి. అచ్చ తెలుగు ఆడపడుచు అయిన అంజలి మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తెలుగులో అవకాశాలు రాకపోవడం వల్లే తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయిన ఈమె అక్కడ కెరియర్ మొదలుపెట్టి స్టార్డం సంపాదించుకుంది.

ఇకపోతే అంజలి అందరూ హీరోయిన్ల లాగా కాకుండా పద్ధతిగా ఉంటూ ఎదుటివారిని నొప్పించకుండా తన మాట తీరుతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ 50 సినిమాలు పూర్తి చేసి ఒక మైలురాయిని దాటింది. హాఫ్ సెంచరీ పూర్తిచేసి అరుదైన రికార్డు సృష్టించింది. అది కూడా తన హిట్ మూవీ అయినా తెలుగు మూవీ గీతాంజలి సీక్వెల్ తో ఆ రికార్డును కాస్త సృష్టించిందని చెప్పవచ్చు.ఇకపోతే గీతాంజలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన అంజలి.. గీతాంజలి 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాండ్గా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ మరింత భయపెడుతోందని చెప్పాలి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: