
తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది చిత్రయూనిట్. 'కొందరు ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం వల్లే గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది' అంటూ చిత్రయూనిట్ పోస్ట్ చేసింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలో చరణ్ మొదటిసారిగా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఇక ఈ విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే చాలాసార్లు ఈ మూవీ నుంచి ఫోటోస్, సాంగ్స్ లీక్ కావడంతో మేకర్స్ సీరియస్ అయ్యారు. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ఇటు గేమ్ ఛేంజర్ తోపాటు .. అటు ఇండియన్ 2 ను రూపొందిస్తున్నారు శంకర్. ఇందులో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.