అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య అఖిల్ లకు ఇప్పటివరకు సరైన అదృష్టం తలుపు తట్టలేదు అన్నది వాస్తవం. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బడా నిర్మాణ సంస్థ బ్యాకింగ్ ఉన్నప్పటికీ ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్ లో చేరలేకపోయారు అన్నది వాస్తవం.ఆమధ్య విడుదలై అఖిల్ కెరియర్ లో భారీ ఫ్లాప్ గా మారిన ‘ఏజెంట్’ మూవీ పై ఆమూవీ నిర్మాతలు 80 కోట్లు పెట్టుబడి పెట్టడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఈసినిమా భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ నిర్మాతకు సుమారు 40 కోట్లవరకు నష్టం వచ్చింది అన్న ప్రచారం కూడ జరిగినది. అంతేకాదు అఖిల్ లాంటి ఫ్లాప్ హీరో పై అంత భారీ పెట్టుబడి ఎధైర్యంతో ఆమూవీ నిర్మాత పెట్టాడు అంటూ కొందరు కామెంట్స్ కూడ చేశారు.ఇప్పుడు నాగచైతన్య హీరోగా చెందు మొండేటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న మూవీ పై 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు అని వస్తున్న వార్తలు విని ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం చైతన్య కెరియర్ అంతంత మాత్రంగా ఉంది. అతడు ఈమధ్య నటించిన ‘కస్టడీ’ ‘థాంక్యూ’ సినిమాలు ఫ్లాప్ గా మారడంతో చైతూ మార్కెట్ కూడ బాగా డల్ గా నడుస్తోంది.ఈ వాస్తవాలను పట్టించుకోకుండ ఎంతో అనుభవం ఉన్న గీతా ఆర్ట్స్ సంస్థ నాగచైతన్య సినిమా పై ఇంత భారీ బడ్జెట్ ఎధైర్యంతో ఖర్చు పెడుతోంది అని కొందరు షాక్ అవ్వడమే కాకుండా అఖిల్ అనుభవాలను నాగచైతన్య పట్టించుకోడా అంటూ కొందరి కామెంట్స్. అయితే ఈవిషయంలో కొందరి అభిప్రాయాలు మరొక విధంగా ఉన్నాయి. దర్శకుడు చెందు మొండేటి నాగచైతన్యతో తీస్తున్న మూవీని పాన్ ఇండియా మూవీగా తీస్తున్న పరిస్థితులలో ఆకథ డిమాండ్ చేయడంతో గీతా ఆర్ట్స్ సంస్థ చైతూ సినిమా పై 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతోంది అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: