మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. ఈయనకు మలయాళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నప్పటికీ ఈ నటుడు కేవలం మలయాళ ఇండస్ట్రీ సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు.లో ఈ నటుడు మహానటి , సీతా
 రామం అనే రెండు సినిమా లలో హీరో గా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. 

అలాగే ఇందులో దుల్కర్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శకులను ఆకట్టుకున్నాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి విజయాలను సాధించడంతో దుల్కర్ సల్మాన్ కి తెలుగు లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. దానితో ఈ నటుడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోయే లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ కూడా పూజా కార్యక్రమాలతో లాంచింగ్ కూడా అయింది. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ యువ నటుడు కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సంస్థ ఈ సినిమాను తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: