విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే అద్భుతమైన కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి సందీప్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఇదే కథను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ పేరుతో సందీప్ రీమేక్ చేశాడు. ఇక ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఈ దర్శకుడి కి హిందీ సింక్ పరిశ్రమలో కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ఈయన బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా వరకు వర్క్ కంప్లీట్ అయింది. దానితో ఈ మూవీ ఫస్ట్ కాపీని తాజాగా తెలుగు నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు చూశాడట. చూసిన వెంటనే ఆయన ఈ మూవీ అవుట్ పుట్ కు ఫిదా అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను ఇప్పటికే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ ను ఈ నెల 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ టీజర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: