రాఘవ లారెన్స్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రౌనౌత్ కలిసి నటించిన లేటెస్ట్ సినిమా చంద్రముఖి 2.  సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమా ప్రమోషన్స్ జరుపుతున్నారు మేకర్స్. సెప్టెంబర్ 23న చంద్రముఖి 2 ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కంగనా హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ 2 సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న కంగనకు ఎదురవగా, దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. అలాగే ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 2009లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించిన

తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అయితే మళ్లీ చాలాకాలం తర్వాత సౌత్ మూవీ 'చంద్రముఖి 2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్.. ఎక్ నిరంజన్ 2 సినిమా ఛాన్స్ వస్తే ప్రభాస్ పక్కన నటిస్తారా? అని అడిగితే, ప్రభాస్ తో కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ ఇష్టపడతానని చెబుతూ డార్లింగ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. "ప్రభాస్ తో కలిసి పని చేసేందుకు ఇష్టపడతా. అతని సక్సెస్ పట్ల చాలా సంతోషిస్తున్నా. పాన్ ఇండియా స్టార్ గా ఆయన అద్భుతంగా ఎదిగారుమ్ మేము 'ఏక్ నిరంజన్' సినిమా చేసినప్పుడు మా వయసు చాలా తక్కువ . ప్రభాస్ చాలా యంగ్. 

సినిమా చేసే సమయంలో ప్రభాస్ చాలా గొప్పగా ఆతిధ్యం ఇచ్చారు. ఫామ్ హౌస్ లో మాకు అద్భుతమైన ఆహారం ఇచ్చారు. అతను చాలా దయాగుణం ఉన్న వ్యక్తి. మేము సెట్స్ లో చాలా సరదాగా గడిపాము. షూటింగ్లో మేమిద్దరం చాలా ఆట పట్టించుకునే వాళ్ళం కూడా. ఆప్యాయంగా ఉండే వాళ్ళం. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. దానికంటే ముందు ప్రభాస్ ని కలవాలని అనుకుంటున్నా  ఎందుకంటే ఆయన్ని కలిసి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. అతనితో నటించే ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తా. ఓ వ్యక్తిగా, నటుడిగా ఆయన ఎదిగిన తీరుని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. 


మరింత సమాచారం తెలుసుకోండి: