పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. అయితే ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా సమాచారం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే సలార్ సినిమాని నిర్మిస్తున్న హోంబులే ఫిల్మ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన సలార్ ని నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే పోటీతోపాటు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆ ఒత్తిడిని తీసుకోకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేయాలని మేకర్స్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారట. 

వచ్చే ఏడాది అంటే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన నిర్మాతల దృష్టిలో లేదట. ఎందుకంటే హఠాత్తుగా అనౌన్స్ చేసి మళ్లీ ఆ డేట్ కి రిలీజ్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెష్ గా 2024 మార్చి 22న 'సలార్' రిలీజ్ డేట్ ని లాక్ చేసే దిశగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ గత ఏడాది విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' మూడు రోజుల ముందు విడుదల తేదీ. గత ఏడాది మార్చి 25న 'ఆర్ ఆర్ ఆర్' విడుదలై సంచలన విజయం అందుకుని ఆస్కార్ దాకా వెళ్ళింది. వేసవి సెలవులకు ముందు వచ్చి పిల్లల పరీక్షలు అయిపోయేనాటికీ నిలదొక్కుకుంటే బాక్సాఫీస్ దగ్గర 'సలార్ 'కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం. 

అందుకే ఈ ఆప్షన్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ రిలీజ్ సమస్య కేవలం తెలుగు వర్షం మాత్రమే కాదు. పాన్ వరల్డ్ స్థాయి కాబట్టి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నుంచి కూడా ఎలాంటి క్లాష్ లేకుండా చూసుకోవాలి. అలా చేయకపోతే ఓవర్సీస్ లో ఎక్కువగా స్క్రీన్స్ దొరకవు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేకర్స్  సలార్ సినిమాని వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ కు సంబంధించి మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అక్టోబర్ లో ప్రభాస్ పుట్టిన రోజు నాడు ట్రైలర్ రావడం అనుమానమే అని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: