తెలుగు బుల్లితెరపై రియాల్టీ షోగా బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్ లని పూర్తిచేసుకుని ఇప్పుడు ఏడవ సీజన్లో మూడు వారాలను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. అయితే మిగతా సీజన్లలో 21 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చి షో ని నడిపించగా.. ఈసారి మాత్రం కేవలం 14 మందిని మాత్రమే హౌస్ లోకి తీసుకొచ్చారు. అందులో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు మాత్రమే ఈసారి బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా మొదలైంది. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో కూడా వివిధ రకాల టాస్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి


ఇక హౌస్ మేట్స్ కావాలంటే.. పవర్ అస్త్ర గెలుచుకోవాలి. అలా మొదటిసారి ఆట సందీప్ పవర్ అస్త్ర ను సొంతం చేసుకుని మొదటి హౌస్ మేట్ గా స్థానం సంపాదించుకోగా.. ఆ తర్వాత శివాజీ రెండవ హౌస్ మేట్  గా, శోభా శెట్టి మూడవ హౌస్ మేట్ గా స్థానం సంపాదించుకున్నారు.  ఇకపోతే ఎలిమినేషన్ విషయానికి వస్తే.. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ తెలుగు రాదు అన్న ఒక కారణంతో ఎలిమినేట్ కాగా రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం అందరూ ఊహించినట్టుగానే సింగర్ దామిని కూడా ఎలిమినేట్ అయింది. సింగర్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న దామిని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. తన పర్ఫామెన్స్ తో బాగానే ఆకట్టుకుంది అయితే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడంతో ఈ షో ఆమెకు లాభాన్ని ఇచ్చిందా ? లేక నష్టాన్ని మిగిల్చిందా ? అనేది మరింత ఉత్కంఠ గా మారిందని చెప్పవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే బిగ్బాస్ వల్ల దామినికి నష్టమే కలిగింది. ఎందుకంటే వారానికి రూ .2లక్షల చొప్పున కేవలం రూ .6లక్షలు మాత్రమే ఆమె తీసుకెళ్లింది.  సాధారణంగా ఒక పాట పాడితే లక్షల్లో పారితోషకం తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇలా మూడు వారాలపాటు హౌస్ లో ఉన్నప్పటికీ కూడా కేవలం రూ .6లక్షలతోనే సరిపెట్టుకుంది.  ఒక రకంగా చెప్పాలి అంటే ఆమె ఇంట్రెస్ట్ వల్లే బిగ్ బాస్ లోకి వచ్చిందే తప్పా ఆమెకు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: