రబ్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ను ఈ నెల 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ కి సంబంధించిన అన్ని పనులు ముగిసినట్లు అందులో భాగంగా ఈ మూవీ టీజర్ ను ఇప్పటికే కొంత మంది వీక్షించినట్లు ఈ సినిమా టీజర్ ను చూసినవారు అందరూ కూడా ఈ టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది అని ఈ మూవీ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు కూడా చూశాడట.

మూవీ అవుట్ పుట్ ను చూసి షాక్ అయినా దిల్ రాజు వెంటనే ఈ సినిమా యొక్క ఆంధ్ర , తెలంగాణ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ మూవీ యొక్క ఆంధ్ర మరియు తెలంగాణ థియేటర్ హక్కులను 15 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: