
ఈసినిమాకు జాతీయ స్థాయిలో మరింత క్రేజ్ తీసుకు రావడానికి మంచు విష్ణు అనుసరించబోతున్న వ్యూహం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారాం ఈమూవీలో కీలకమైన శివుడు పాత్రను ప్రభాస్ తో అదేవిధంగా పార్వతి దేవిగా నయన తారతో నటింప చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపధ్యంలో మంచు విష్ణు ప్రభాస్ తో చేస్తున్న రాయబారాలు విజయవంతం అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. గతంలో ప్రభాస్ నయన తారలు ‘యోగి’ మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోయినప్పటికి ఆమూవీలో నటించిన ప్రభాస్ నయనతారల కెమిస్ట్రీని ప్రేక్షకులు అప్పట్లో బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆతరువాత వీరిద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేవు.
‘శ్రీరామరాజ్యం’ లో సీతగా నయనతార ఎంతో గొప్పగా నటించిన సంధర్భంలో పార్వతి పాత్రలో కూడ నయనతార బాగుంటుంది అన్న అంచనాలు ఈ మూవీ నిర్మాతలకు ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార ఆమధ్య గ్రామదేవత బ్యాక్ డ్రాప్ లో అమ్మోరు తల్లిగా ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈమూవీని ఓటిటిలో బాగా చూశారు. దీనితో నయనతార పార్వతిగా అన్నివిధాల సరిపోతుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ అంతా ఫైనల్ అయ్యాక ఈమూవీ యూనిట్ విదేశాలకు వెళ్ళి అక్కడ ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తి చేస్తారు అని టాక్..